Mallika Sherawat: స్క్రీన్‌పైనే కాదు మాతోనూ బోల్డ్‌గానే ఉండొచ్చు అనేవాళ్లు! - mallika sherawat on why she has never worked with star heros
close
Published : 24/09/2021 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mallika Sherawat: స్క్రీన్‌పైనే కాదు మాతోనూ బోల్డ్‌గానే ఉండొచ్చు అనేవాళ్లు!

ముంబయి: విభిన్న కథా చిత్రాల్లో నటించి బీటౌన్‌లో బోల్డ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి మల్లికా షెరావత్‌. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇటీవల ఆమె కీలకపాత్రలో నటించిన ‘నకాబ్‌’ సిరీస్‌ విడుదలైన తరుణంలో మల్లిక విలేకర్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా తన సినీ కెరీర్‌ గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు బయటపెట్టారు.

‘‘నటిగా నా ప్రయాణం చాలా సాఫీగా ప్రారంభమైంది. నటి కావాలనే ఉద్దేశంతోనే ముంబయికి వచ్చాను. వెంటనే ‘క్వాయిష్‌’లో ఆ తర్వాత ‘మర్డర్‌’ చిత్రంలో అవకాశం వచ్చింది. దాని వల్ల అదృష్టవశాత్తూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొలేదు. కానీ, ‘మర్డర్‌’ తర్వాత నాపై బోల్డ్‌ అనే ముద్ర పడింది. చాలామంది స్టార్‌ హీరోలు నాతో మితిమీరి బోల్డ్‌గా మాట్లాడేవాళ్లు. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు వ్యక్తిగతంగా నువ్వు మాతోనూ బోల్డ్‌గానే ఉండొచ్చు అనేవాళ్లు. వ్యక్తి, వృత్తిపరమైన జీవితాన్ని వాళ్లు ఒకేలా చూడటం వల్ల నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొవాల్సి వచ్చింది. దాంతో.. ‘నన్ను క్షమించండి. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఆ విషయంలో నేను రాజీ పడను. నా కంటూ కెరీర్‌ నిర్మించుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను’ అని చెప్పేసేదాన్ని. దాని కారణంగానే కొంతమంది స్టార్‌ హీరోలు నాతో వర్క్‌ చేయలేదు’’ అని మల్లికా వివరించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని