close
హాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సెప్టెంబర్‌లో ‘మిషన్‌ ఇంపాజిబుల్ 7 షూటింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టామ్‌ క్రూజ్‌ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 7’. కరోనా వైరస్‌ కారణంగా సినిమా షూటింగ్‌ నిరవధికంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభించాలని చిత్రనిర్మాణ సంస్థ యోచిస్తుంది. చిత్ర నటుడు సైమన్‌ పెగ్‌ (బెంజీ డున్‌ పాత్రలో నటిస్తున్నారు) ఓ పత్రికతో మాట్లాడుతూ..‘‘సినిమా షూటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు రోజూ సెట్‌కి వచ్చిన తర్వాత పరీక్షలు జరిపించాలి. అలా రోజూ చేయాలి. మరీ ఎలా చేస్తారో లేదో నాకైతే తెలియదు’ అని చెబుతున్నారు. 

యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. స్కైడ్యాన్స్ మీడియా టీసీ ప్రొడక్ష‍న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో వింగ్ రేమ్స్,రెబెకా ఫెర్గూసన్, వెనెస్సా కిర్బీ, హేలే అట్వెల్, హెన్రీ సెర్నీ తదితరులు నటిస్తున్నారు. పారామౌంట్‌ పిక్చర్‌ పంపిణీదారుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.