Cinema News: నటి అనిత షాకింగ్‌ నిర్ణయం - naagin actress anita hassanandani bids goodbye to acting
close
Published : 13/06/2021 11:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: నటి అనిత షాకింగ్‌ నిర్ణయం

గుడ్‌బై అంటూ పోస్ట్‌

ముంబయి: ‘నువ్వు నేను’తో కథానాయికగా తెరంగేట్రం చేసి తెలుగు వారికి చేరువైన ముంబయి ముద్దుగుమ్మ అనిత తన అభిమానుల్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేశారు. ఇటీవల తల్లైన ఆమె.. నటనకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇకపై తాను ఇంట్లోనే ఉండి.. తన బిడ్డ ఆరవ్‌ సంరక్షణ చూసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ‘ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇండస్ట్రీకి దూరం కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా బాబు సంరక్షణ చూసుకోవడం నాకెంతో అవసరం. ఈ క్రమంలోనే ఇకపై సినిమాలు, సీరియల్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాను. భవిష్యత్తులో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెడతానా? లేదా? అనే విషయంపై ఎలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతానికి కొన్ని కమర్షియల్‌ యాడ్స్‌కి పనిచేస్తున్నాను. ఒకవేళ నేను తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకుంటే తప్పకుండా అందరికీ చెబుతాను’ అని అనిత ప్రకటించారు.

‘నువ్వు-నేను’ విజయం తర్వాత అనితకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగుతోపాటు దక్షిణాదిలో తెరకెక్కిన పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. అనిత ప్రస్తుతం ‘నాగిని’ ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇక, వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే హీరోయిన్‌గా రాణిస్తున్న తరుణంలోనే పారిశ్రామికవేత్త రోహిత్‌ను 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ భామ మగబిడ్డకు జన్మనిచ్చింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని