close
Published : 10/04/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ చిత్రాల రికార్డులను బీట్‌ చేసిన ‘పుష్ప’ టీజర్‌

ఇంటర్నెట్‌ డెస్క్: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న చిత్రం. అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్‌ 7న పుష్పరాజ్‌ పాత్రని పరిచయం చేస్తూ చిత్రబృందం టీజర్‌ విడుదల చేసింది. విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్‌ సంపాదించింది. ఇక ఇప్పటివరకూ యూట్యూబ్‌లో 30 మిలియన్‌ వ్యూస్‌ని దాటేసింది. అంతేకాదు, మిలియన్‌ లైక్స్‌కు చేరువైంది.

ముఖ్యంగా లైక్స్‌ విషయంలో ‘బాహుబలి’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాల రికార్డును ‘పుష్ప’ అధిగమించింది. ‘తగ్గేదే..లే’ అని బన్నీ చెప్పిన డైలాగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్ కనపించనున్నారు. జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, సునీల్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 13న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని