close
Published : 28/02/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈమధ్య కాలంలో కుర్రకారు ఫోన్లతో పాటు టీవీల్లోనూ తెగ వినిపిస్తోంది ‘జాతిరత్నాలు’లోని ‘చిట్టి’ పాట. జనవరి 11న విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లోనూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అయితే.. ఈ పాటకు ‘రంగస్థలం’ సినిమాలోని చిట్టిబాబు(రామ్‌చరణ్‌) స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది..? ఇలా వచ్చిన ఆలోచనతో ఓ అభిమాని ఒక మాషప్‌ వీడియో చేశాడు. ‘జాతిరత్నాలు’లోని ‘చిట్టి నీ నవ్వంటే’ ఆడియోకు ‘రంగస్థలం’లోని ‘ఎంత సక్కగున్నావే’ పాట వీడియోను జత చేశాడు. అది ఇప్పుడు యూట్యూబ్‌లో దూసుకెళుతోంది.

‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి హీరోగా అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాతి రత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌. కామెడీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాధన్‌ సంగీతం అందించారు. నాగ్‌ అశ్విన్‌ నిర్మాత. ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌ విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని