close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సామ్‌, కీర్తిసురేష్‌ల ఇన్‌స్టా పోస్ట్‌ ఏంటంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇళయ దళపతి విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రాన్ని థియేటర్లో చూసేందుకు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని నటి సమంత అంటున్నారు. అలాగే మరో నటి కీర్తి సురేష్‌ థియేటర్లో ‘మాస్టర్‌’ చిత్రాన్ని చూస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

సమంత ఇన్‌స్టా స్టోరి ఏంటంటే..
‘జనవరి 13న పెద్ద వేడుక చేసుకోబోతున్నాం. ఇంకా ఎదురుచూడటం నావల్ల కాదు’ అంటూ సమంత ఫైర్‌ ఎమోజీలను ఉంచారు. అలాగే ఆ స్టోరికి నటుడు విజయ్‌, విజయ్‌సేతుపతి, హీరోయిన్‌ మాళవిక మోహన్‌, నిర్మాత జగదీష్‌లను ట్యాగ్‌ చేశారు.

కీర్తి సురేష్‌ ఏం పోస్ట్‌ చేసింది..
కీర్తి సురేష్ మాస్టర్‌ సినిమాను థియేటర్లో చూస్తున్న ఓ ఫొటోను షేర్‌ చేశారు. అందులో మాస్టర్‌ చిత్రం మొదటిరోజు, మొదటి ఆటను చూస్తునట్లు చెప్పారు. అలాగే ‘చాలా కాలం తర్వాత మళ్లీ థియేటర్లో సినిమాను చూస్తున్నా. నిజంగా ఆ అనుభూతి అద్భుతం’ అంటూ రాసుకొచ్చారు. ‘మాస్టర్‌’ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.
సమంత విజయ్‌తో ‘కత్తి’, ‘తెరి’ సినిమాల్లో నటించగా, కీర్తి సురేష్‌ విజయ్‌ సరసన ‘సర్కార్‌’లో నటించింది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్టర్‌’ చిత్రంలో విజయ్‌తో పాటు విజయ్‌సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారు. మాళవిక మోహన్‌ కథానాయిక.

ఇవీ చదవండి!

జనవరి 15న రానున్న ‘సైకిల్‌’

ఆ డైలాగ్‌లన్నీ సింగిల్‌ టేక్‌లో చెప్పింది!



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు