MAA Elections: బండ్లగణేశ్‌ కామెంట్స్‌పై స్పందించడం అనవసరం - telugu news jeevitha rajasekhar comments on bandla ganesh video
close
Published : 14/09/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: బండ్లగణేశ్‌ కామెంట్స్‌పై స్పందించడం అనవసరం

జీవిత రాజశేఖర్‌

హైదరాబాద్‌: నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ చేసిన కామెంట్స్‌పై స్పందించడం అనవసరమని నటి జీవిత రాజశేఖర్‌ అన్నారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ తరఫు నుంచి జనరల్‌ సెక్రటరీ పదవి కోసం జీవిత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 10న జరగనున్న ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ ప్రచారం షురూ చేసింది. దీనిలో భాగంగా ఆదివారం 100 మంది సినీ కళాకారులతో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సమావేశమైంది. కరోనా కాలంలో మీటింగ్‌లు పెట్టి కళాకారుల ప్రాణాలతో చెలగాటాలాడొద్దంటూ బండ్లగణేశ్‌ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన జీవిత.. ‘ఆయన మాటలకు సమాధానమివ్వడం కూడా అనవసరం. ఆయన పెట్టిన వాట్సాప్‌ వీడియో చూస్తే చిన్న పిల్లల పనిలా ఉంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మనం ఫంక్షన్స్ చేసుకుంటున్నాం. పూజలు చేసుకుంటున్నాం. బయటకు వెళ్తున్నాం. అదే మాదిరిగా మా మీటింగ్‌లో కూడా కొవిడ్ ప్రొటోకాల్‌ ఫాలో అయ్యాం. కళాకారులకు ఆయన మంచి చేయాలనుకుంటే చేయవచ్చు. నేను కూడా అదే ఉద్దేశంతో బరిలోకి దిగాను. ‘నేనే గెలుస్తా’ అని ఆయనలా నేను చెప్పలేను. నాకు ఆయనంత గట్టి నమ్మకం లేదు. ఓట్ల కోసం అభ్యర్థుల్ని రిక్వెస్ట్‌ చేస్తా. నా పనితీరు నచ్చితే వాళ్లే నాకు ఓటు వేస్తారు. ఒకవేళ గెలిస్తే తప్పకుండా వాళ్లకి కావాల్సిన అభివృద్ధి పనులు చేస్తా’ అని జీవిత అన్నారు. మరోవైపు ఈ ఏడాది జరగబోయే ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీ కోసం తలపడతున్న జీవితకు బండ్లగణేశ్‌ పోటీ ఇవ్వనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని