Maheshbabu: కొత్త మహేష్‌ను చూస్తారు - telugu news maheshbabu new comments on sarkaruvaripata
close
Published : 26/09/2021 09:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maheshbabu: కొత్త మహేష్‌ను చూస్తారు

మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14రీల్స్‌ ప్లస్‌ సంస్థలు   సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. ఈ సినిమా విశేషాలను మహేష్‌ తాజాగా మీడియాతో పంచుకున్నారు. ‘‘సింగిల్‌ సిట్టింగ్‌లో ఈ కథకు ఓకే చెప్పా. జనవరిలో సినిమా ప్రారంభించాం. ఇప్పటి వరకు దాదాపు 60శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంతో ప్రేక్షకులు కచ్చితంగా ఓ కొత్త మహేష్‌ను చూస్తారు’’ అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌తో చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని మహేష్‌ ఈ సందర్భంగా స్పష్టత ఇచ్చారు.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని