MAA Elections: ‘మా’ ఎన్నికల్లో మరో వివాదం.. జీవితపై ఆరోపణలు చేసిన పృథ్వీరాజ్ - telugu news prudhviraj about jeevitha maa elections
close
Published : 23/09/2021 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో మరో వివాదం.. జీవితపై ఆరోపణలు చేసిన పృథ్వీరాజ్

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల అంశం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నడూ లేనంతగా మాటల యుద్ధం జరుగుతోంది. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి బండ్ల గణేశ్‌ బయటికి రావడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. విష్ణు ప్యానెల్ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తోన్న పృథ్వీరాజ్‌ ఎన్నికల అధికారికి లేఖ రాయడం తాజాగా వివాదాస్పదమైంది. జీవిత.. ఓటర్లని మభ్యపెడుతున్నారని, తాత్కాలిక సభ్యులను ప్రలోభ పెడుతున్నారని, నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. విష్ణు ప్యానెల్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే పృథ్వీరాజ్‌ లేఖ రాయడంతో ఎన్నికల హీట్‌ మరింత వేడెక్కింది. జీవిత.. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్ నుంచి జనరల్‌ సెక్రటరీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని