Kamal Haasan: నాన్న కోలుకుంటున్నారు: శ్రుతిహాసన్‌ - telugu news shruti haasan about kamal haasan health
close
Published : 25/11/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kamal Haasan: నాన్న కోలుకుంటున్నారు: శ్రుతిహాసన్‌

చెన్నై: కరోనా బారిన పడిన తన తండ్రి, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కోలుకుంటున్నారని శ్రుతిహాసన్‌ తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారామె. ‘మా నాన్న ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే మీ అందరితో మాట్లాడుతారు’ అని పేర్కొన్నారు. మరోవైపు, చికిత్స అందిస్తున్న శ్రీ రామచంద్ర ఆస్పత్రి వర్గాలూ కమల్‌ హెల్త్‌ బులిటెన్‌ని విడుదల చేశాయి. చికిత్స కొనసాగుతుందని, కమల్‌ ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపాయి. కమల్‌ అమెరికా ట్రిప్‌ ముగించుకుని ఇటీవల నగరానికి చేరుకున్నారు. దగ్గు వస్తుండటంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Read latest Cinema News and Telugu News


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని