Vishwak Sen: మా కాస్ట్‌లో అమ్మాయిలు దొరకడం లేదు.. సంబంధం ఉంటే చూడండి! - vishwak sen as arjun kumar allam in ashoka vanamlo arjuna kalyanam
close
Updated : 05/09/2021 04:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vishwak Sen: మా కాస్ట్‌లో అమ్మాయిలు దొరకడం లేదు.. సంబంధం ఉంటే చూడండి!

హైదరాబాద్‌: ‘‘వయసు 30 దాటేసింది.. జుట్టు కూడా పోతోంది.. పొట్ట కూడా వచ్చేసింది.. మా కాస్ట్‌లో అమ్మాయిలు దొరకడం లేదు.. మంచి సంబంధం ఏదైనా ఉంటే చూసి పెట్టొచ్చు కదా!  పెద్ద పట్టింపులు కూడా ఏమీలేవు. కట్నం కూడా వద్దు.. నా పేరు అర్జున్‌ కుమార్‌ అల్లం’’ అంటున్నారు యువ కథానాయకుడు విష్వక్‌సేన్‌. ఆయన కీలక పాత్రల్లో విద్యా సాగర్‌ చింత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.

శనివారం ఈ సినిమాలోని అర్జున్‌గా విష్వక్‌ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను పంచుకుంది. పెళ్లి సంబంధం కోసం అమాయకంగా విష్వక్‌ అడుగుతున్న తీరు నవ్వులు పంచుతోంది. ఇటీవల చిత్రీకరణ మొదలైన ఈ సినిమాను ఎస్‌వీసీసీ డిజిటల్‌ పతాకంపై బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మిస్తున్నారు. జై క్రిష్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు అర్థమవుతోంది. మరి అర్జున్‌కు అమ్మాయి దొరికిందా? ఎవరా అమ్మాయి? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని