Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119008794
            [news_title_telugu_html] => 

‘సైరా’లో ఆ యాక్షన్‌ సన్నివేశమే హైలైట్‌ అట!

[news_title_telugu] => ‘సైరా’లో ఆ యాక్షన్‌ సన్నివేశమే హైలైట్‌ అట! [news_title_english] => Surender Reddy About Sye Raa Narasimha Reddy action sequences [news_short_description] => అగ్ర కథానాయకుడు చిరంజీవి టైటిల్‌రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి ఈ సినిమాను [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => qZoWxaz2YPc [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 00:05:09 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘సైరా’లో ఆ యాక్షన్‌ సన్నివేశమే హైలైట్‌ అట! - Surender Reddy About Sye Raa Narasimha Reddy action sequences - EENADU
close

తాజావార్తలు

‘సైరా’లో ఆ యాక్షన్‌ సన్నివేశమే హైలైట్‌ అట!

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి టైటిల్‌రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలను భారీగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సురేందర్‌రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సైరా’లో దాదాపు 10 భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉండగా, అన్నీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయని చెప్పారు. 

‘‘సైరా’లో పోరాట ఘట్టాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. స్వాతంత్ర్యపోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో అప్పటి వాతావరణాన్ని సహజంగా కనిపించేలా శ్రద్ధ తీసుకున్నాం. అన్నింటికంటే క్లైమాక్స్‌ ముందు వచ్చే యుద్ధ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. అదే విధంగా విరామ సమయానికి ముందు ఒక యాక్షన్‌ సన్నివేశం వస్తుంది. అది అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌. దీన్ని ముంబయిలోని భారీ స్విమ్మింగ్‌ పూల్‌లో తెరకెక్కించాం. ఈ సన్నివేశం ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెడుతుంది. అంతేకాదు ఆ సీన్‌ చూస్తున్నంత సేపూ ఒళ్లు గగురుపొడుస్తుంది. సినిమాలోని పోరాట ఘట్టాలన్నీ చిరు అలవోకగా చేసేశారు. అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌కు కేవలం ఒకరోజు మాత్రమే శిక్షణ తీసుకుని ఎలాంటి భయం, బెరుకు లేకుండా చేసేశారు. ఆయన అంత ధీమాగా చేస్తున్నా, మాకు మాత్రం లోపల చాలా భయం ఉండేది. రెండు రోజులు పడుతుందనుకున్న సీన్‌ను కేవలం ఒక పూటలోనే చిరు పూర్తి చేసేశారు. అది నటనపై మెగాస్టార్‌కు ఉండే ప్యాషన్‌’’ అని సురేందర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. 

ఇక తమన్నా ఇందులో లక్ష్మి అనే పాత్రను పోషిస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సహాయకారిగా ఉండే పాత్ర ఇది. తాజాగా ఈ పాత్రకు సంబంధించి హిందీ వెర్షన్‌ డబ్బింగ్‌ను తమన్నా పూర్తి చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ.. ‘ఇప్పుడే ‘సైరా’ హిందీ వెర్షన్‌ డబ్బింగ్‌ పూర్తయింది. ఈ సినిమాలో నటించడం నిజంగా అద్భుతమైన అనుభూతి. త్వరలోనే మిమ్మల్ని థియేటర్స్‌లో కలుస్తా’ అని పేర్కొన్నారు. 

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై దాదాపు రూ.270కోట్ల భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మించారు. అమిత్‌ త్రివేది స్వరాలు సమకూర్చారు. జులియస్‌ పాకియం నేపథ్య సంగీతం అందించారు. పరుచూరి బ్రదర్స్‌ కథను అందించగా, బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు రాశారు. జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, అనుష్క కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.