close

తాజావార్తలు

స్త్రీలు సాధించడానికే పుట్టారు: నమిత

కోడంబాక్కం, న్యూస్‌టుడే: స్త్రీలు సాధించడానికే పుట్టారని.. వారి పుట్టుకను ప్రతి తల్లిదండ్రులు సంతోషంగా భావించాలని నటి నమిత పేర్కొన్నారు. ఫ్లష్‌ ఆధ్వర్యంలో అందం, కురుల అలంకరణకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటీమణులు నమిత, సంతోషి, బుల్లితెర నటి రక్షిత ధినేష్, ప్రియాంక, తెలుగు బిగ్‌బాస్‌ ఫేమ్‌ శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ ‘రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో ఆడబిడ్డ పుడితే సంబరాలు చేసుకుంటారు. ఆ సందర్భంగా ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటతారు. దాదాపు 15 సంవత్సరాలుగా అక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ విధానం ఆర్థికంగానూ వారికి లబ్ధిని చేకూర్చుతోంది. అమ్మాయి పుడితే ప్రతి తల్లిదండ్రులు అదృష్టంగా భావించాలి. కుటుంబ సభ్యులు బాధపడడానికి మహిళలు పట్టడం లేదు. సాధించడానికి వారు పడుతున్నారు. వారంతా వీర నారీమణులని’ పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు మోడళ్లు ప్రేక్షకులను అలరించారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.