ఎనిమిది రోజులు.. 9 మంది అత్యాచారం..!
close

తాజా వార్తలు

Published : 09/03/2021 02:03 IST

ఎనిమిది రోజులు.. 9 మంది అత్యాచారం..!

కోట: స్కూల్‌ బ్యాగ్‌ కొనిస్తానని తీసుకెళ్లి ఓ బాలికను ఆమె స్నేహితులు ఎనిమిది రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని ఝులావర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. ఝులావర్‌ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఫిబ్రవరి 25న ఆమె స్నేహితులు బ్యాగ్‌ కొనడానికని చెప్పి నగరానికి దూరంగా ఉన్న నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి బాలికకు బలవంతంగా డ్రగ్స్‌ ఇచ్చి అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని ఎనిమిది రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. ఎనిమిది రోజుల తర్వాత శుక్రవారం ఇంటికి చేరుకున్న బాలిక.. తనపై 9 మంది అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ మంజీత్ సింగ్‌ తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా.. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని