కొడుకును చంపి.. కాల్చేందుకు యత్నం

తాజా వార్తలు

Updated : 29/09/2020 23:53 IST

కొడుకును చంపి.. కాల్చేందుకు యత్నం

జార్ఖండ్‌ : తన భార్యను తిట్టాడని ఆగ్రహించిన ఓ తండ్రి.. కొడుకును చంపాడు. ఆపై శవాన్ని కాల్చేందుకు యత్నించి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో చోటు చేసుకుంది. మహేశ్వర్‌ సింగ్‌(55) అనే వ్యక్తి దివ్యాంగురాలైన తన భార్యను కొడుకు తిడుతూ, కొడుతుండటంతో ఆగ్రహించాడు. తల్లిని హిసించొద్దని చెప్పినా వినకపోవటంతో తండ్రికొడుకుల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ పెద్దదై మహేశ్వర్‌ కర్రతో బలంగా కొడుకు సుకేంద్ర సింగ్‌(30) తలపై కొట్టాడు. దీంతో అతనికి తీవ్రగాయాలు కావడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మృతదేహాన్ని కాల్చేయాలని మహేశ్వర్‌ ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి శవపరీక్షకు పంపారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. తన భార్యను హింసించినందుకే కొడుకును చంపినట్లు మహేశ్వర్‌ పోలీసు విచారణలో పేర్కొన్నారు. సుకేంద్ర సింగ్‌ రోజూ మద్యం తాగి కుటుంబ సభ్యులను కొట్టేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.   

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని