నా కొడుకును కాల్చి చంపండి..!
close

తాజా వార్తలు

Published : 04/07/2020 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా కొడుకును కాల్చి చంపండి..!

యూపీ ఎన్‌కౌంటర్‌ ఘటనపై నిందితుడి తల్లి

లఖ్‌నవూ: సంచలనం సృష్టించిన కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాన నిందితుడైన గ్యాంగస్టర్ వికాస్ దూబే తల్లి తన కుమారుడి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది పోలీసులను చంపి తన కుటుంబాన్ని అప్రతిష్టపాల్జేసిన వికాస్ దూబేను కాల్చి చంపాలంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని దూబేను కోరారు. లేదంటే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చావు తప్పదని హెచ్చరించారు. అతను చేసింది చాలా పెద్ద నేరమని.. ఒకవేళ పోలీసులు అతణ్ని పట్టుకుంటే వెంటనే కాల్పి చంపాలని కోరారు. నాలుగు నెలలుగా వికాస్‌ను తాను కలవలేదని ఆమె తెలిపారు. లఖ్‌నవూలోని చిన్నకుమారుడి వద్దే తాను ఉంటున్నట్లు చెప్పారు. చాలా ఏళ్ల నుంచి వికాస్‌ వల్ల తన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం రౌడీమూకల కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. రౌడీషీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు గురువారం అర్ధరాత్రి పోలీసులు వెళ్లగా..ఓ ఇంటిపై మాటువేసిన దుండగులు పోలీసు బృందంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60 క్రిమినల్‌ కేసుల్లో వికాస్‌దూబే నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మృతుల కుటుంబాలను పరామర్శించారు. చనిపోయినవారి ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయంతో పాటు.. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఫించను వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఘటనని సవాల్‌గా స్వీకరించిన యూపీ పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అతణ్ని పట్టించిన వారిని రూ.50వేల నగదు ప్రకటించారు. అలాగే సంఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు దొరికినట్లు స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే పోలీసులు ఎదురుకాల్పులు జరిపినప్పటికీ.. దుండగులను ఎదుర్కోలేకపోయినట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని