
తాజా వార్తలు
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీఐడీ దర్యాప్తు
ఈనాడు, కాకినాడ : హిందూ దేవుళ్లను కించపరిచేలా వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి అరెస్టయిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వ్యవహారంపై సీఐడీ బృందం దర్యాప్తు జరిపింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని బ్రహ్మానందపురం గ్రామంలో ప్రవీణ్ చక్రవర్తికి చెందిన ఇల్లు, విద్యా సంస్థల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి సీఐడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం సీఐడీ సెబర్ క్రైం ఎస్పీ రాధిక విలేకర్లతో మాట్లాడారు.
ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడినట్లు విడుదలైన వీడియోపై కేసు దర్యాప్తు కొనసాగుతోందని రాధిక చెప్పారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు చేసిన వ్యాఖ్యలపై లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ఏ గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చారు? ఎక్కడి విగ్రహాలు.. ఎలా ధ్వంసం చేశారన్న దానిపై విచారణ చేస్తామన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎలక్ట్రానిక్ ఆధారాలు సేకరించామని, మరిన్ని ఆధారాలను సహ కుట్రదారులు దాచినట్లు అనుమానిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామన్నారు.
ఇవీ చదవండి..
తప్పుడు కేసులకు భయపడం: దేవినేని ఉమ
మావోయిస్టుల కన్నా భాజపా డేంజర్: దీదీ