తుపాకీతో బెదిరించిన ఆర్మీ జవాన్‌ అరెస్టు

తాజా వార్తలు

Updated : 22/03/2021 06:10 IST

తుపాకీతో బెదిరించిన ఆర్మీ జవాన్‌ అరెస్టు

రింగురోడ్డు‌: తుపాకీతో బంగారం వ్యాపారిని బెదిరించిన ఆర్మీ జవాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్వతీపురం మండలం చినబంటువలస గ్రామానికి చెందిన సీహెచ్‌ రాజేశ్వరరావు ఉత్తరప్రదేశ్‌లో ఆర్మీజవానుగా పనిచేస్తున్నాడు. ఇటీవల సెలవుపై సొంతూరుకు వచ్చాడు. గతంలో భూ వ్యవహారానికి సంబంధించి రూ.22 లక్షలను రాజేశ్వరావు నష్టపోయాడు. పోగొట్టుకున్న డబ్బును సంపాదించేందుకు అడ్డదారులు ఎంచుకున్నాడు. 

దీనిలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.30వేలతో ఓ నాటు తుపాకీని కొనుగోలు చేశాడు. గతనెల ఏడో తేదీన పార్వతీపురం మండలానికి చెందిన బంగారం వ్యాపారి చినగుంపస్వామి అలియాస్‌ బాబు ఇంటివద్దకు రాజేశ్వరరావు వెళ్లి తుపాకీతో రెండు రౌండ్లు గాల్లోకి జరిపాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న బాబు ఏం జరిగిందో అర్థంకాక బయటకొచ్చి చూశాడు. అప్పటికే రాజేశ్వరరావు అక్కడనుంచి వెళ్లిపోయాడు. 

మరుసటిరోజు ఉదయం బాబుకు రాజేశ్వరరావు ఫోన్‌ చేసి ఆంధ్రా, ఒడిశా, ఝార్ఖండ్‌ ప్రాంతాల మావోయిస్టు కమాండర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత నిన్న రాత్రి మీ ఇంటి పరిసరాల్లో వచ్చిన శబ్దాలు తుపాకీ కాల్పులని, అవి తానే చేశానని బెదిరించాడు. తక్షణమే రూ.5 కోట్ల రూపాయలకు ఇవ్వకపోతే ఆ కాల్పులు నీపై జరుపుతానని బాబును బెదిరించాడు. ఈ క్రమంలో రూ.5కోట్లు ఇవ్వలేనని.. రూ.కోటిన్నర మాత్రమే గవ్వగలనని బాబు ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత బంగారం వ్యాపారి బాబు పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయాన్ని వివరించి రాజేశ్వరరావుపై ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రణాళిక ప్రకారం బాబుతో పాటు ఆ నగదు తీసుకుని నిందితుడు చెప్పిన చిరునామాకు వెళ్లారు. అక్కడే ఉన్న రాజేశ్వరరావును గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును చేధించిన పోలీసులను ఎస్పీ రాజకుమారి అభినందించి రూ.నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని