విద్యుత్‌ స్తంభం ఎక్కి తాగుబోతు హల్‌చల్ 

తాజా వార్తలు

Published : 09/07/2021 18:38 IST

విద్యుత్‌ స్తంభం ఎక్కి తాగుబోతు హల్‌చల్ 

హైదరాబాద్‌: మందుబాబులు మద్యం కోసం ఏదైనా చేస్తారు. తాగిన మైకంలో ఒక్కోసారి ప్రమాదకరంగా మారి ప్రజలను భయపెడతారు. తాజాగా జవహార్ నగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కౌకూర్ చౌరస్తాలో అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఒక తాగుబోతు 11 కేవీ 33 విద్యుత్ స్తంభం ఎక్కి హల్ చల్ చేశాడు. మద్యం కొనివ్వాలని లేదంటే కిందకు దూకుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. స్థానికుల విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించగా  కరెంట్ సరఫరా నిలిపివేశారు. కాగా తాగుబోతు కిందకు రాకుండా గంటపాటు స్తంబం మీదే కూర్చుని అందరినీ ఆందోళనకు గురిచేశాడు. అనంతరం స్థానికుల అభ్యర్థన మేరకు కిందకు దిగాడు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని