close

తాజా వార్తలు

ఆటోలోనే అఘాయిత్యం

 ఒంగోలు నేరవిభాగం: ఆమెపట్ల వాళ్లు నిర్దయగా వ్యవహరించారు. రోడ్డు వెంట నడిచి వెళ్తుండగా మాట్లాడుకుని ఆటో ఎక్కించుకున్నారు. దానిలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు స్పృహ కోల్పోయిన స్థితికి చేరగా మానవత్వం మరిచి అమానుషంగా బయటకు లాగి పడేసి వెళ్లారు. ఇదీ...ఒంగోలు చినమల్లేశ్వర కాలనీ శివారులో వివాహితపై జరిగిన హత్యాచార సంఘటనలో శుక్రవారం వెలుగుచూసిన కొత్త విషయం. ఆర్టీసీ బస్టాండు సెంటరులోని ఓ ఆటో డ్రైవర్‌ చీమకుర్తికి చెందిన, అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఒక ప్రయాణికుడితో కేశవరాజుకుంట వైపు బయలుదేరాడు. అతడ్ని ఏమార్చి సొత్తు కాజేయాలనుకుని పాత మార్కెట్‌ సెంటరు ప్రాంతానికి చెందిన తన మిత్రుడ్ని దారిలో సిద్ధంగా ఉండాలని ఫోన్‌ చేసి చెప్పాడు. మార్గమధ్యలో నడిచి వెళ్తున్న వివాహితతో ఉన్న పాత పరిచయంతో నగదు ఇస్తానని, తనతో రమ్మని చెప్పి ఎక్కించుకున్నాడు. వెళుతూ వెళుతూ దారిలో ఎదురుచూస్తున్న మిత్రుడ్ని కూడా ఎక్కించుకొని చినమల్లేశ్వర కాలనీ శివారుకు చేరాడు. అక్కడ అంతా కలిసి మద్యం తాగారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న మిత్రులిద్దరితోపాటు ప్రయాణికుడు కూడా ఆటోలోనే ఆమెపై పదేపదే అత్యాచారం చేశారు. ఆ క్రమంలో మాటా మాటా పెరగడంతో ఛాతీపై బలంగా కొట్టారు. దాంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా వదిలించుకోవాలని వివస్త్రగా ఉండగానే కాళ్లు పట్టుకొని బయటకు లాగేశారు. దాంతో తల వెనుక గాయమైంది. ఆమె చరవాణిని ఆటో డ్రైవర్‌ తీసుకొని దానిలోని సిమ్‌ కార్డును తీసి పారేసి తన సిమ్‌ను వేసుకుని అక్కడ్నుంచి ఉడాయించాడని పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం.

నిందితుల విచారణ

ఫోన్‌ డేటా, సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా కేసును పోలీసులు మరింతగా పరిశోధిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్‌ అధికారి జగదీష్‌, ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్‌.వి.ప్రసాద్‌ పర్యవేక్షణలో ఒంగోలు తాలూకా, గ్రామీణ సీఐలు ఎం.లక్ష్మణ్‌, పి.సుబ్బారావు మూడు రోజులుగా అదే పనిలో నిమగ్నమయ్యారు. సంఘటన వెలుగు చూసినప్పటి నుంచి పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ముగ్గురు యువకులతోపాటు మంగళవారం రాత్రి ఈ సంఘటనకు ముందు ఫోన్లో ఆమెతో మాట్లాడిన మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండ్రోజుల్లోనే కేసు కొలిక్కివచ్చే అవకాశం ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.