దివ్య హత్య: మరెవరికీ దక్కకూడదనే అలా..!

తాజా వార్తలు

Published : 21/02/2020 00:36 IST

దివ్య హత్య: మరెవరికీ దక్కకూడదనే అలా..!

కేసు వివరాలు వెల్లడించిన గజ్వేల్‌ ఏసీపీ నారాయణ

సిద్దిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన బ్యాంకు ఉద్యోగిని దివ్యను హత్య చేసింది తానేనని వేములవాడకు చెందిన వెంకటేశ్‌ ఒప్పుకొన్నట్లు గజ్వేల్‌ ఏసీపీ నారాయణ తెలిపారు. తనకు దక్కని దివ్య మరెవరికీ దక్కకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెంకటేశ్‌ ఒప్పుకొన్నాడని ఏసీపీ చెప్పారు. దివ్య హత్య కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. వేములవాడకు చెందిన వెంకటేశ్‌ దివ్యను హత్య చేసి ఉంటాడని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెంకటేశ్‌ కోసం గాలించినట్లు ఏసీపీ చెప్పారు. నిన్న రాత్రి వేములవాడలో వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడని పేర్కొన్నారు.

ఏసీపీ నారాయణ మాట్లాడుతూ.. ‘వెంకటేశ్‌, దివ్య ఒకే పాఠశాలలో చదువుకున్నారు. చదువుకునే రోజుల్లోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దివ్య ఉద్యోగానికి సన్నద్ధమయ్యే సమయంలోనే ప్రేమిస్తున్నాడని వెంకటేశ్‌ చెప్పాడు. పెళ్లి చేసుకుందామని దివ్య వెంట పడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో బ్యాంకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి దివ్య వెంకటేశ్‌ను దూరం పెడుతూ వచ్చింది. దీంతో వెంకటేశ్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని దివ్య మరెవరికీ దక్కకూడదని వెంకటేశ్‌ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 18న దివ్య ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెంకటేశ్‌ ఆమెపై దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో దివ్య గొంతు, ఇతర భాగాలపై పొడిచి చంపేశాడు. హత్య అనంతరం నేరుగా సికింద్రాబాద్‌ వెళ్లి అక్కడ నుంచి రైలులో విజయవాడకు వెళ్లాడు. విజయవాడ నుంచి వరంగల్‌ మీదుగా మళ్లీ వేములవాడకు చేరుకున్నాడు’ అని ఏసీపీ నారాయణ వివరించారు. హత్యానేరాన్ని ఒప్పుకొన్న నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు గజ్వేల్‌ ఏసీపీ తెలిపారు.

 

ఇవీ చదవండి..

గజ్వేల్‌లో బ్యాంకు ఉద్యోగిని దారుణ హత్య

దివ్య హత్య నిందితుడి లొంగుబాటుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని