పోలీసుల కస్టడీలో ఉన్నాను.. నేనే ఆ మహిళను

తాజా వార్తలు

Published : 20/04/2020 00:33 IST

పోలీసుల కస్టడీలో ఉన్నాను.. నేనే ఆ మహిళను

ఫేస్‌బుక్‌లో నకిలీ పేజీ సృష్టించిన వ్యక్తి అరెస్టు

ఛత్తీస్‌గఢ్‌: నిశా జిందాల్‌ పేరిట ఫేస్‌బుక్‌లో ఓ పేజీ ఉంది. దానికి దాదాపు పదివేలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల మత సామరస్యానికి భంగం వాటిల్లేలా ఆ పేజీలో వివాదాస్పద పోస్టులు వచ్చాయి. ఐపీ అడ్రస్‌ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది. అసలు ఆ ప్రొఫైల్‌ నకిలీదని.. మహిళ పేరుమీద ఓ వ్యక్తి దాన్ని నడిపిస్తున్నాడని తేలడంతో కంగుతిన్నారు. ఈ వ్యవహారం ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో వెలుగుచూసింది. స్థానిక ఐఏఎస్‌ అధికారి ప్రియాంక శుక్లా తన ట్వీటర్‌ ఖాతాలో వివరాలు వెల్లడించారు. ‘ఆ పేజీ మహిళకు చెందింది కాదు. స్థానికంగా రవి అనే వ్యక్తి నకిలీ ప్రొఫైల్‌ సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. అతను 11 ఏళ్లుగా ఇంజినీరింగ్‌ పాసయ్యేందుకు విఫలయత్నం చేస్తున్నాడు’ అందులో పేర్కొన్నారు.
పోలీసుల వినూత్న శిక్ష..
రాయ్‌పూర్‌ పోలీసులు సైతం శిక్షగా నిందితుడితోనే అతని నిజమైన ఫొటోను సదరు పేజీలో పోస్ట్‌ చేయించారు. ‘నేను పోలీసుల కస్టడీలో ఉన్నాను. నేనే నిశా జిందాల్‌ను’ అని ఫాలోవర్స్‌కు తెలిసేలా క్యాప్షన్‌ రాయించారు. మరోవైపు ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి భూపేశ్‌ భాగేల్‌ స్పందిస్తూ.. ‘మోసం తప్పించుకోజాలదు. తప్పుదోవ పట్టించాలనుకునేవారి అన్ని వివరాలను వెల్లడిద్దాం. గుడ్‌ జాబ్‌ రాయ్‌పూర్‌ పోలీసులు’ అని ట్వీట్‌ చేశారు. పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి.. అతని చరవాణులు, ల్యాప్‌టాప్‌లను సీజ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని