బాలికపై కన్నతండ్రి అత్యాచారం

తాజా వార్తలు

Updated : 30/05/2020 04:38 IST

బాలికపై కన్నతండ్రి అత్యాచారం

కేసు నమోదు... నిందితుడి రిమాండ్‌

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురనే జ్ఞానం కూడా లేకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన  తాండూరు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. తాండూరు గ్రామీణ ఎస్‌ఐ సంతోష్‌ శుక్రవారం చెప్పిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాలిక (13) తల్లి పదేళ్ల క్రితమే మృతి చెందింది. అనంతరం తండ్రి (37) మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో కూతురును దోమ మండలంలోని ఓ ప్రార్థనా పాఠశాలలో ఉంచి చదివిస్తున్నాడు. మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా కూతురు ఇంటికి చేరుకుంది. కామాంధుడై కూతురిపై కన్నేసిన అతను పవిత్ర రంజాన్‌ రోజునే ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కూతురు సవతి తల్లితోపాటు ఎవరితోనూ చెప్పులేక లోలోన కుమిలిపోయింది. రెండు రోజుల క్రితం కూతురిని హైదరాబాద్‌లోని పెద్దమ్మ ఇంటికి పంపించాడు. దీంతో తండ్రి చేసిన అఘాయిత్యాన్ని పెద్దమ్మకు వివరించింది. ఆమె వెంటనే గ్రామానికి చేరుకుని విషయాన్ని బాలిక నానమ్మకు వివరించింది. జరిగిన ఉదంతంపై తండ్రిని నిలదీశారు. అనంతరం బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని