close

తాజా వార్తలు

Updated : 05/05/2021 06:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భర్త మృతదేహంతో.. చిమ్మ చీకట్లో..

 నడిరోడ్డుపై వదిలేసిన ట్యాక్సీ డ్రైవర్‌

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలోని అక్కవరం సమీపంలో రోడ్డుపక్కన చిమ్మచీకట్లో ఓ మహిళ భర్త మృతదేహంతో కొన్ని గంటలపాటు సాయం కోసం ఎదురు చూసింది. మంగళవారం రాత్రి ఎస్సై కామేశ్వరరావు విషయం తెలుసుకొని.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ఒడిశా బాలాసోర్‌కు చెందిన అంజలి అనారోగ్యానికి గురైన తన భర్త ప్రదీప్‌కుమార్‌ను హైదరాబాద్‌ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌ ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. ట్యాక్సీలో వెళుతుండగా టెక్కలి సమీపంలోకి వచ్చే సరికి ప్రదీప్‌కుమార్‌ మృతిచెందారు. ట్యాక్సీ డ్రైవరు అక్కవరం సమీపంలో రహదారి పక్కన మృతదేహాన్ని, ఆమెను దించేసి వెళ్లిపోయాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఎస్సై మరో ట్యాక్సీని మాట్లాడి మృతదేహంతోపాటు మహిళను బాలాసోర్‌ పంపేలా చొరవ చూపారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని