దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

తాజా వార్తలు

Published : 09/11/2020 02:03 IST

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన బాధితుడు

తిరువనంతపురం: పడుకునేముందు చాలా మంది ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టడం, తమ దిండు కింద పెట్టుకుని పడుకోవడం చేస్తుంటారు. అయితే దిండుకింద పెట్టిన ఓ ఫోన్‌ పెలిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కొల్లాం జిల్లాలో ఓ వ్యక్తి తన నోకియా ఫీచర్‌ ఫోన్‌ను రాత్రిపూట పడుకునే ముందు దిండు కింద పెట్టి నిద్రకు ఉపక్రమించాడు. ఒక్కసారిగా ఫోన్‌ పేలడంతో అతడి భుజం, ఎడమ మోచేతికి గాయాలు అయ్యాయి. పడుకునేముందు చొక్కా ధరించకపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 

సంఘటనకు సంబంధించి బాధితుడు వివరాల ప్రకారం.. ‘నేను త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుడిని తన గమ్యస్థానం వద్ద వదిలిపెట్టి ఇంటికి వచ్చా. అప్పటికే బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నా. అయితే ఒక్కసారిగా శబ్దం రావడంతో మేల్కొన్నా. భుజం వద్ద నొప్పిగా అనిపించింది. దిండు కాలిపోతూ ఉండగా ఫోన్‌ నుంచి నిప్పులు వస్తున్నాయి. వెంటనే ఫోన్‌ను దూరంగా నెట్టేసి ఆసుపత్రికి వెళ్లాను’ అని వివరించాడు. దిండు కింద ఉంచేటప్పుడు ఛార్జింగ్‌ పెట్టలేదని, అయినప్పటికీ బ్యాటరీ ఉబ్బిపోయి పేలిపోయిందని బాధితుడు పేర్కొన్నాడు. పేలడానికి గల కారణం ఏంటో తెలియడం లేదని, నోకియా సంస్థ సమస్యను గుర్తించి పరిష్కరించాలని బాధితుడు కోరాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని