close

తాజా వార్తలు

Updated : 06/03/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి

శ్రీకాకుళం: విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పెడదారి పట్టాడు. తన వద్ద చదివే ఆడపిల్లలతో అసభ్యకరంగా మాట్లాడుతూ దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాంలో చోటు చేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీ కృష్ణ తమతో అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని చితకబాదారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా మార్పు రాలేదని.. అందుకే దేహశుద్ధి చేశామని గ్రామస్థులు తెలిపారు. ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని