close

ప్రధానాంశాలు

Updated : 27/01/2021 07:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పట్టపగలు.. ప్రాణం తీసిన పగలు

భూ వివాదాల్లో అందరూ చూస్తుండగానే దాయాదుల దాడి
తండ్రి మృతి, కుమారుడికి గాయాలు
అడ్డుకునే ప్రయత్నం చేయని గ్రామస్థులు

నాంపల్లి, న్యూస్‌టుడే: భూ తగాదాల నేపథ్యంలో తండ్రి, కొడుకులపై గ్రామంలో అందరూ చూస్తుండగానే దాయాదులు దాడికి పాల్పడగా తండ్రి మృతి చెందారు. ఈ దారుణ ఘటన నాంపల్లి మండలం బండతిమ్మాపురం పంచాయతీ పాటిమీదిగూడెం ఆవాస గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. నాంపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బోదాసు వెంకటయ్య (56)కు, దాయాదులకు మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం పొలం వద్ద ఉన్న వెంకటయ్య కుమారుడు బోదాసు అశోక్‌పై దాయాదులైన బోదాసు కృష్ణయ్య, అతని కుమారులు విజయ్‌, నాగరాజు, గిరయ్య, వెంకటయ్యలు దాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్న అశోక్‌ పరుగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చాడు. దాయాదులు అతడిని తరుముకుంటూ వస్తుండగా గ్రామంలో తండ్రి వెంకటయ్య తారసపడ్డారు. వెంటనే అశోక్‌ను వదిలిపెట్టి ఆయనపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దారుణాన్ని గ్రామంలోని కొందరు చూసినా, అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్య సుమారు రెండు గంటలసేపు గాయాలతో రోడ్డుపక్కనే నరకయాతన అనుభవించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చేవరకు ఆయన గాయాలతో ఎండలోనే ఉండిపోయారు. నిందితులు ఆ సమీపంలోనే ఉండడంతో భయంతో అశోక్‌ తండ్రి దగ్గరకు వెళ్లలేకపోయాడు. మొబైల్‌ ఫోన్లలో ఈ దృశ్యాలు చిత్రీకరించిన వ్యక్తులైనా కనీసం 108కు ఫోన్‌ చేయలేదు. సుమారు రెండు గంటల తర్వాత అక్కడకు చేరుకున్న పోలీసులు మొదట నిందితులను, తర్వాత గాయాలతో ఉన్న బాధితుణ్ని పలు ప్రశ్నలు అడిగి విచారించిన అనంతరం అంబులెన్స్‌ను రప్పించి వెంకటయ్యను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామంలో పట్టపగలే జరిగిన దాడి వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన