ఫార్మసీ విద్యార్థినిది కట్టుకథా చిత్రమే!
close

ప్రధానాంశాలు

Published : 14/02/2021 05:30 IST

ఫార్మసీ విద్యార్థినిది కట్టుకథా చిత్రమే!

అపహరణ..అత్యాచారం.. అంతా ఓ నాటకం
యువతి తప్పుదోవ పట్టించింది
ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకే
పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, కుషాయిగూడ: నలుగురు వ్యక్తులు అపహరించి, సామూహిక అత్యాచారం చేశారంటూ కీసరకు చెందిన బీఫార్మసీ విద్యార్థిని చెప్పిందంతా కట్టుకథ అని రాచకొండ పోలీసులు స్పష్టంచేశారు. తొలుత బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా సామూహిక అత్యాచారంగా కేసు నమోదు చేశామని, సాక్ష్యాధారాలు సేకరించాక అత్యాచారం జరగలేదనే నిర్ధారణకు వచ్చామన్నారు. ఇల్లు వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో వేర్వేరు ప్రాంతాల్లో తిరిగానని, ఆ సమయంలో తల్లి భయపెట్టడంతో అత్యాచారం అనే నాటకాన్ని అమలుచేశానని బాధితురాలు అంగీకరించినట్టు చెప్పారు. ఇందుకు విద్యార్థిని చేసిన ప్రయత్నాలను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కోర్టు అనుమతితో యువతిపై కేసు నమోదు చేస్తామన్నారు.

చిన్న అనుమానం..మారిన వ్యవహారం
‘తమ కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారంటూ ఫార్మసీ విద్యార్థిని బంధువులు బుధవారం సాయంత్రం డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు రాత్రి 7.40 గంటల ప్రాంతంలో అన్నోజీగూడ రైల్వేగేట్‌కు కాస్త దూరంలో పొదల్లో అర్ధనగ్నంగా ఉన్న యువతిని గుర్తించారు. కాలికి గాయాలై నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడంతో ఇబ్బందిపెట్టకుండా సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌కు దర్యాప్తు బృందం గురువారం రాత్రి ఏర్పాట్లు చేసుకుంది. ఈ క్రమంలో కిడ్నాప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్‌ ఆ సమయంలో ఘటనా స్థలంలో లేడని సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా బృందంలోని ఓ సీఐ తెలుసుకున్నారు. అప్పటికే అదుపులో ఉన్న అతన్ని మరోసారి సీఐ ప్రశ్నించారు. విద్యార్థిని ఆర్‌ఎల్‌నగర్‌లో దిగలేదని, వేరే స్టాప్‌లో దిగిందని అతను చెప్పాడు. ఆటో సవారీ పూర్తయ్యాక సినిమాకు వెళ్లి తర్వాత మద్యంతాగి ఇంటికెళ్లినట్టు వివరించాడు. అతను చెప్పిన వివరాలన్నీ నిజమేనని నిర్ధారణకు వచ్చాక దర్యాప్తు అధికారులు రివర్స్‌ ఇన్వెస్టిగేషన్‌ను ప్రయోగించారు. అన్నోజిగూడలో యువతిని రక్షించిన స్థలం నుంచి ఆమె ఇంటి బస్‌స్టాప్‌ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు. బుధవారం సాయంత్రం 6-7.30 గంటల మధ్యకాలంలో హెరిటేజ్‌ బస్‌స్టాప్‌, యంనంపేట గ్రామం, శ్రీనిధి కళాశాల, ఘట్‌కేసర్‌ ప్రధాన రహదారి, ఎన్‌టీపీసీ క్రాస్‌రోడ్స్‌ అన్నోజిగూడ గ్రామాల్లో ఆమె ఒంటరిగానే నడిచినట్లు గుర్తించారు.

ఇవీ నిజాలు...ఇప్పుడు చెప్పండని నిలదీయడంతో
అపహరణ, అత్యాచారం అబద్ధమని నిరూపించేందుకు కావాల్సిన స్పష్టమైన ఫుటేజీలు, ఇతర సాక్ష్యాధారాలను మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి సేకరించారు. వాటితో లఘుచిత్రాన్ని తయారుచేసి శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని వద్దకు వెళ్లారు. ‘‘ఇవీ నిజాలు. ఇప్పుడు చెప్పండి. మీపై ఎవరు అత్యాచారం చేశారు’’ అని డీసీపీ ప్రశ్నించారు.  తర్వాత చెబుతానని యువతి అనడంతో వెనక్కు వచ్చేశారు. ‘శనివారం ఉదయం ఆసుపత్రి నుంచి నేరుగా రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌కు వచ్చిన యువతి, తాను చెప్పిందంతా అబద్ధమని మా ఎదుట అంగీకరించింది’ అని మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. వాస్తవాలను తెలుసుకునేందుకు మూడు రోజులు పట్టిందన్నారు. ఈ వ్యవహారంలో ఆటో డ్రైవర్లకు ఎలాంటి సంబంధంలేదన్న సీపీ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టి ఉంటే  క్షమించాలని ఆటోడ్రైవర్లను కోరారు.

కిడ్నాప్‌ కథలంటే ఇష్టమట
ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అపహరణ నాటకం ఆడడం వెనుక ప్రధాన కారణం కిడ్నాప్‌ కథలంటే యువతికి ఉన్న విచిత్రమైన ఇష్టమేనని సీపీ తెలిపారు. ఆరు నెలల క్రితం స్నేహితురాలికి ‘తన తమ్ముణ్ని ఆస్తి కోసం ఎవరో అపహరించారని’ ఆమె అబద్ధం చెప్పిందని, పలుమార్లు పలువురికి ఇలా చెప్పినట్టు తెలుసుకున్నామన్నారు. యువతి ఇంటి నుంచి ఎందుకు పారిపోవాలనుకుందో తెలుసుకున్నారా? అని విలేకర్లు ప్రశ్నించగా,  తెలుసుకోలేదని .. అపహరణ, తదనంతరం పరిణామాలపైనే తాము దృష్టి కేంద్రీకరించామని రాచకొండ జాయింట్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన