
ప్రధానాంశాలు
రూ.96.78 లక్షల నగదు స్వాధీనం
జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్టుడే: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు చిల్లకల్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరకు కారులో రూ.96,78,560 నగదు తరలిస్తుండగా.. తనిఖీల్లో భాగంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మిర్చి అమ్మిన రైతులకు చెల్లించడానికి నగదు తీసుకెళ్తున్నట్లు చెప్పారని, కానీ ఆ నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ మొత్తాన్ని తీసుకెళ్తున్న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన సయ్యద్ బాషా, చందర్లపాడు మండలం కాండ్రపాడుకు చెందిన షేక్ జాలిబ్ సాహెబ్, తెలంగాణలోని ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రామిశెట్టి రవికుమార్, మహారాష్ట్రకు చెందిన మహేంద్ర రాథోడ్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మరిన్ని
సినిమా
- కార్చిచ్చులా కరోనా
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- చెన్నై చెడుగుడు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ
- భారత్లో కరోనా: యూకే ఆంక్షలు
- వచ్చే 3 వారాలు కీలకం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
