నిడ్జూరులో తెదేపా కార్యకర్త హత్య
close

ప్రధానాంశాలు

Published : 10/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిడ్జూరులో తెదేపా కార్యకర్త హత్య

మృతదేహంతో వైకాపా నాయకుడి ఇంటి వద్ద ఆందోళన
 18 మందిపై కేసు
 సీఐపై వేటు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా నిడ్జూరుకు చెందిన తెదేపా కార్యకర్త కురువ శ్రీనివాసులు(44) హత్యకు గురయ్యారు. పథకం ప్రకారం కొట్టి చంపారంటూ మృతుడి కుటుంబీకులు వైకాపా నాయకుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో 18 మందిపై హత్య కేసు నమోదుకాగా.. ఓ సీఐపై వేటు పడింది. బాధితులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిడ్జూరులో పక్కపక్క ఇళ్లలో ఉండే వైకాపాకు చెందిన సర్పంచి మాధవి, సంపత్‌కుమార్‌ దంపతులకు.. తెదేపా కార్యకర్త శ్రీనివాసులు కుటుంబసభ్యుల మధ్య ఈనెల 8వ తేదీన ఘర్షణ చోటుచేసుకుంది. ఆ రోజు రాత్రి గిన్నెలు తోముకుంటున్న సర్పంచి మాధవి ఆ మురుగు నీరు శ్రీనివాసులు భార్య సుజాతపై పడేలా చల్లారు. ఎందుకు చల్లావని సుజాత ప్రశ్నించడంతో సంపత్‌కుమార్‌ జోక్యం చేసుకుని ఘర్షణకు దిగారు. ఇరు కుటుంబాలు గొడవపడ్డాయి. సంపత్‌కుమార్‌ తదితరులు కారం పొడి చల్లి దాడి చేశారు. సర్పంచి వర్గీయులు శ్రీనివాసులు ఛాతీపై  బలంగా కొట్టడంతో అతను కుప్పకూలారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని తీసుకొని స్వగ్రామానికి చేరుకున్న బంధువులు, కుటుంబసభ్యులు వైకాపా నాయకుడు సత్యంరెడ్డి ఇంటి ఆవరణలో శ్రీనివాసులు మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. మృతదేహం పంచనామాకు నిరాకరించడంతో గ్రామపెద్ద రాంభూపాల్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ రామాంజనాయక్‌, సిబ్బంది కలసి ఆదివారం బాధితుల కుటుంబ సభ్యులతో చర్చించారు. చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో చివరికి శవపరీక్షకు అంగీకరించారు. హత్యోదంతంపై మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలతో పాటు అనేక సందర్భాల్లో కర్నూలు తాలుకా అర్బన్‌ సీఐ విక్రమ్‌సింహా వైకాపా వర్గీయులకు అనుకూలంగా వ్యవహరించారని వెంకటేశ్వర్లు కుటుంబీకులు ఆరోపించారు.  కురువ సంపత్‌ కుమార్‌, సర్పంచి మాధవి, వి.సత్యనారాయణరెడ్డి సహా మొత్తం 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఆరోపణల నేపథ్యంలో సీఐ విక్రమ్‌సింహాను వీఆర్‌కు పంపుతూ దర్యాప్తు బాధ్యతలను కర్నూలు తాలుకా సర్కిల్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డికి అప్పగిస్తూ ఎస్పీ కె.ఫక్కీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రశ్నిస్తే.. అంతమొందించటమే: చంద్రబాబు
వైకాపా అవినీతిని ప్రశ్నించిన తెదేపా కార్యకర్తలను అంతమొందించటమే లక్ష్యంగా సీఎం జగన్‌ పాలన సాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెదేపా కార్యకర్త శ్రీనివాసులును హత్య చేయటాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీనివాసులు కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని తెలిపారు.   పార్టీ నేతలు లోకేశ్‌, అచ్చెన్నాయుడు కూడా హత్యను ఖండించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన