బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం

ప్రధానాంశాలు

Published : 24/07/2021 04:35 IST

బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. వరంగల్‌ 1 డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు 30 మంది ప్రయాణికులతో శుక్రవారం మధ్యాహ్నం హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. దీనికి ఇంజిన్‌ వెనకాల ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ వద్దకు చేరగానే ఇంజిన్‌ నుంచి పొగలు వెలువడి వాసన రావడంతో డ్రైవర్‌ వెంకటేశ్‌ అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికులను దింపారు. కాసేపటికే భారీ మంటలు ఎగసిపడి బస్సు మొత్తం కాలిపోయింది. స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది నీటి ట్యాంకర్‌ తీసుకొచ్చి మంటలను ఆర్పారు. ఇంజిన్‌లో తలెత్తిన షాట్‌ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని వరంగల్‌ అర్బన్‌ జిల్లా డీవీఎం శ్రీనివాసరావు తెలిపారు.

- న్యూస్‌టుడే, స్టేషన్‌ఘన్‌పూర్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన