డీఆర్‌డీవో కేసు నిందితులకు రిమాండ్‌

ప్రధానాంశాలు

Published : 19/09/2021 05:17 IST

డీఆర్‌డీవో కేసు నిందితులకు రిమాండ్‌

కటక్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌లో ఉన్న డిఫెన్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)లో రహస్యాలు లీకు చేసిన కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులను 7 రోజుల పాటు రిమాండ్‌కు తరలించేందుకు శనివారం స్థానిక కోర్టు అనుమతించింది. నిందితులను బాలేశ్వర్‌ జైలు నుంచి కటక్‌లోని క్రైమ్‌ బ్రాంచ్‌ కార్యాలయానికి తరలించి విచారించనున్నారు. ఈ సందర్భంగా క్రైమ్‌ బ్రాంచ్‌ ఏడీజీ సంజీబ్‌ పండా బాలేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నిందితులు ఏ రహస్యాలు, ఎవరెవరికి అందజేశారు. దీని వెనుక ఎవరున్నారు. వీరికి ఎంత డబ్బు అందింది. నగదు ఇచ్చిందెవరు?’’ తదితర అంశాలపై అన్ని కోణాల్లో విచారించనున్నట్లు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన