చెరువులో పాఠశాల బస్సు బోల్తా

ప్రధానాంశాలు

Published : 21/10/2021 05:46 IST

చెరువులో పాఠశాల బస్సు బోల్తా

విద్యార్థి దుర్మరణం

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: చెరువులో పాఠశాల బస్సు బోల్తా పడిన సంఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామానికి చెందిన మైలపల్లి రాము, నీలవేణి దంపతుల పెద్దకుమారుడు రాజు(6) కొంగరాం పంచాయతీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం ఉదయం పాఠశాలకు వెళుతుండగా కొయ్యాం పంచాయతీ నిమ్మవానిపేట సమీపంలోని నల్ల చెరువు వద్ద ఆ బస్సు అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది.  ఆ సమయంలో ఆరుగురు పిల్లలు ఉన్నారు. బస్సు చెరువులోకి ఒరిగిన వైపు కూర్చున్న చిన్నారి రాజు నీటిలో ఇరుక్కుపోవడంతో మృతి చెందాడు. రెండో వైపు కూర్చున్న ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్‌ సంఘటన స్థలం నుంచి పారిపోయి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసులు చేరుకొని చెరువులో మునిగి ఉన్న క్రేన్‌ సహాయంతో బస్సును, ఇరుక్కున్న చిన్నారి మృతి దేహాన్ని బయటకు తీశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన