ఆస్పత్రికని వెళ్లి వివాహిత అదృశ్యం
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

ఆస్పత్రికని వెళ్లి వివాహిత అదృశ్యం

బాపట్ల, న్యూస్‌టుడే : ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి బయల్దేరిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన బాపట్లలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. బేతపూడికి చెందిన లక్ష్మీతిరుపతమ్మకు గుంటూరుకు చెందిన తుమ్మూరు నాగ సురేష్‌రెడ్డితో వివాహమైంది. అనారోగ్యానికి గురైన లక్ష్మీతిరుపతమ్మ చీరాలలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటోంది. శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి ఆర్టీసీ బస్సులో కుమారునితో కలిసి బాపట్ల వచ్చిన ఆమె స్థానిక పాతబస్టాండులో సోదరునికి కుమారుడిని అప్పగించి స్నేహితురాలితో కలిసి చీరాల ఆస్పత్రికి వెళ్లి వస్తానని చెప్పింది. సాయంత్రమైనా బేతపూడిలో పుట్టింటికి రాలేదు. భర్త ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ కృష్ణయ్య శుక్రవారం రాత్రి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని