1090 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

1090 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

మిల్లులో స్వాధీనం చేసుకున్న బస్తాలు

నరసరావుపేట లీగల్‌, న్యూస్‌టుడే : మండలంలోని రావిపాడు గ్రామ సమీపంలో స్వప్న రైస్‌ మిల్లులో గురువారం రూ.41 లక్షల విలువ చేసే 1090 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పౌర సరఫరా శాఖ, రెవెన్యూ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్‌ రమణనాయక్‌ వివరాల మేరకు.. జిల్లా ఉన్నతాధికారుల సమాచారం మేరకు మిల్లులో తనిఖీలు చేయగా రెండు లారీల్లో నుంచి దిగుమతి చేస్తున్న బియ్యాన్ని, దిగుమతి చేసి ప్యాకింగ్‌ మార్చిన బియ్యాన్ని గుర్తించి అధికారులు సీజ్‌ చేశారు. లారీలో 50 కిలోల బరువున్న 450 బస్తాల్లో 225 క్వింటాళ్ల బియ్యం గుర్తించారు. 25 కిలోల చొప్పున 880 బస్తాల్లో 220 క్వింటాళ్ల బియ్యాన్ని ఎరుపురంగు ప్లాస్టిక్‌ సంచుల్లో ప్యాక్‌ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీని సీజ్‌ చేశారు. అలాగే 50 కిలోల చొప్పున 976 బస్తాలు, 25 కిలోల చొప్పున 630 బస్తాల్లో మొత్తం 645.50 క్వింటాళ్ల మిల్లులో నిల్వ చేసినట్లు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకొని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు. మిల్లు యజమాని ఆవుల శివారెడ్డి, గుమస్తా బత్తుల బాలయ్య, లారీ డ్రైవర్లు వి.భూపాల్‌రెడ్డి, బి.కిషోర్‌బాబుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గతంలో ఇదే మిల్లులో సుమారు 3 వేల క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టుబడగా చివరకు 300 క్వింటాళ్లు మాత్రమేనని అధికారులు లెక్కలు తేల్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని