నేడు పాక్షికంగా టీకా ప్రక్రియ
Published : 16/05/2021 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేడు పాక్షికంగా టీకా ప్రక్రియ

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఆదివారం టీకా ప్రక్రియ పాక్షికంగా ఉంటుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.సుహాసిని తెలిపారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్యధిక కేంద్రాల్లో టీకాలు అయిపోయాయని, నిల్వ ఉన్న కేంద్రాలలో మాత్రం ఆదివారం కూడా వేస్తారని వివరించారు. ప్రజలు స్థానిక వాలంటీర్‌ లేదా సచివాలయ సిబ్బందిని సంప్రదించి టీకా ప్రక్రియపై వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

విజయవాడలో నిలుపుదల

నగరపాలక సంస్థకు కేటాయించిన 9 వేల కొవాగ్జిన్‌ టీకాలను శనివారం రెండో డోసు వారికి వేశారని, ఈ నేపథ్యంలో ఆదివారం నగరంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిలుపుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరూ కేంద్రాల వద్దకు రావద్దని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని