368 పాజిటివ్‌ కేసుల నమోదు
logo
Published : 23/06/2021 05:36 IST

368 పాజిటివ్‌ కేసుల నమోదు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో మంగళవారం 368 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు వైరస్‌ కారణంగా మృతి చెందారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 99,065కు చేరింది. 4338 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 93,657 మంది వైరస్‌ను జయించి డిశ్ఛార్జి అయ్యారు. జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 1070కు చేరింది. పాజిటివ్‌ శాతం 5.67గా నమోదయ్యింది. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో 38, విజయవాడ డివిజన్‌ 111, నూజివీడు డివిజన్‌ 155, మచిలీపట్నం డివిజన్‌ 39, గుడివాడ డివిజన్‌ 24 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. జిల్లాలో 3090 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని