జేవీకేతో పాటు పాఠ్యపుస్తకాలు అందజేయాలి
logo
Published : 23/06/2021 05:59 IST

జేవీకేతో పాటు పాఠ్యపుస్తకాలు అందజేయాలి

పుస్తకాలు చూపుతున్న ఆర్జేడీ రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈవో గంగాభవాని తదితరులు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: జగనన్న విద్యాకానుక(జేవీకే) కిట్‌తోపాటు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా అందజేసేందుకు మండల స్థాయిలో అధికారులు, ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య ఆర్జేడీ రవీంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్టాల్‌ బాలికోన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు అందించే కార్యక్రమం ఆర్జేడీ ప్రారంభించారు. ప్రభుత్వం విద్యపట్ల ఎంతో చిత్తశుద్ధితో, నిబద్ధతతో సకల సౌకర్యాలు కల్పిస్తుందని దానిలో భాగంగా ఆకర్షణీయంగా కొత్త పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. డీఈవో గంగాభవాని మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులందరూ సకాలంలో పాఠ్య పుస్తకాలను తమ పాఠశాలలకు చేర్చి జగనన్న విద్యా కానుకతోపాటు విద్యార్థులకు పాఠశాలలు తెరిచేలోగా తప్పనిసరిగా పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఉపవిద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖాధికారి సుధాకర్‌రెడ్డి, ఉర్ధూ పాఠశాలల డీఐ షేక్‌ ఎండీ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని