రేపటి నుంచి తెరుచుకోనున్న పర్యాటక ప్రాంతాలు
logo
Published : 23/06/2021 21:31 IST

రేపటి నుంచి తెరుచుకోనున్న పర్యాటక ప్రాంతాలు

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను గురువారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాజెక్టులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో రెండు విడతల అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రాజెక్టులను ప్రారంభించాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోనూ రెండో విడత అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనందున రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలన్నీ గురువారం నుంచి ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను చాటిచెప్పే విధంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించాల్సిందిగా సూచనలు చేశారు. విశాఖపట్నం బుషికొండలోని పర్యాటకశాఖ బ్లూబే హోటల్‌ను రూ.164 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు ఈనెల 24వ తేదీన బోటు ఆపరేటర్లతోనూ సమావేశం కావాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని