మొలిచిన నవధాన్యాలు.. మొదలుకాని నిర్మాణాలు
eenadu telugu news
Published : 31/07/2021 04:28 IST

మొలిచిన నవధాన్యాలు.. మొదలుకాని నిర్మాణాలు

శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మొక్కలు

మైలవరం, న్యూస్‌టుడే

ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన జగనన్న కాలనీల్లో, పక్కా గృహాల నిర్మాణం శంకుస్థాపనలకే పరిమితమైంది. మైలవరం మండలంలో అతి పెద్ద లేఅవుట్‌గా ఉన్న పూరగుట్టలో వందలాది మంది లబ్ధిదారులతో జులై 1న శంకుస్థాపనలు చేయించిన ప్రదేశంలో మొక్కలొచ్చాయి తప్ప, నేటికీ ఒక్క ఇంటికైనా పునాదులు పడలేదు. విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసి, మూడు బోర్లను బిగించి చేతులు దులిపేసుకున్నారు అధికారులు. ఫలితంగా శంకుస్థాపనలు చేసి 30 రోజులు గడిచినా ప్లాట్లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి.

పశువుల మేతగా లేఅవుట్‌: పచ్చికతో నిండిన 78 ఎకరాల లేఅవుట్‌లో పశువులు మేస్తున్నాయి. మండలంలో 2,721 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా.. అందులో 1450 మందికి పూరగుట్ట లేఅవుట్‌లోనే స్థలాలను కేటాయించారు. శంకుస్థాపన చేసిన దగ్గర్నుంచి పలు చోట్ల బోర్లు వేసి, మూడు మోటార్లు బిగించిన అధికారులు, పైపులైన్లు వేసి ఎక్కడికక్కడ తొట్టెలు కట్టి నీటిని అందించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. లబ్ధిదారులు ముందుకొస్తే వెంటనే ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతుంటే, నీరు లేకుండా ఎలా కట్టుకోవాలంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోనే అతి పెద్ద లేఅవుట్‌లలో ఒకటిగా ఉన్న పూరగుట్టలో నిర్మాణాలను ప్రారంభించలేదు, శంకుస్థాపన చేసిన గోతుల్లో నవధాన్యాల మొక్కలే ఏపుగా ఎదుగుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని