విశాఖ ఉక్కుపై పోరాటం ఉద్ధృతం
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

విశాఖ ఉక్కుపై పోరాటం ఉద్ధృతం

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే : తెలుగు ప్రజల హక్కు విశాఖ ఉక్కు అని కార్మిక-ప్రజా సంఘాల నేతలు నినదించారు. శనివారం నగరంలోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక జిల్లా సమావేశం నిర్వహించారు. జిల్లా కన్వీనర్లు ఎం.వి.సుధాకర్‌, టి.తాతయ్య మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దని, ఉద్యోగులు ఆగస్టు 2, 3వ తేదీల్లో చేపడుతున్న మార్చ్‌ టు పార్లమెంట్‌ కార్యక్రమానికి కార్మిక, ప్రజా సంఘాల మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. మూడు లక్షల కోట్ల ఆస్తులున్న విశాఖ ఉక్కును కారుచౌకగా ప్రైవేటు వారికి అప్పజెప్పాలని భాజపా ప్రభుత్వం చూస్తోందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు నేటికీ పరిహారం ఇవ్వలేదన్నారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు ఎ.వెంకటేశ్వరరావు, కె.దుర్గారావు, టి.ప్రవీణ్‌, హనుమంతరావు, వై.సుబ్బారావు, బి.గోవింద్‌, పింఛనర్ల సంఘం నాయకులు ఆర్‌.కోటేశ్వరరావు, టి.ప్రభుదాస్‌, ట్యాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నాయకులు సుందరరామరాజు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కోటి, నిజాముద్దీన్‌, సీఐటీయూ నాయకులు వి.గురుమూర్తి, బి.రూబెన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని