ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత్‌
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత్‌

భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ


చౌత్రసెంటర్‌లో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న లక్ష్మీనారాయణ.

చిత్రంలో మాజీ మంత్రులు అరుణ, కిశోర్‌బాబు తదితరులు

నగరంపాలెం, న్యూస్‌టుడే: ప్రపంచ దేశాలకు భారత్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ని శుక్రవారం పరిశీలించారు. ముఖ్య అతిథులుగా కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు రావెల కిశోర్‌బాబు, శనక్కాయల అరుణ, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్యలు పాల్గొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఇరవై రోజుల పాటు సేవా, సమర్పణ అభియాన్‌ పేరిట వివిధ కార్యక్రమాలు చేయనున్నట్లు వివరించారు. కరోనా నిర్మూలనకు దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఛౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, పొగాకు బోర్డు ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌ వల్లూరు జయప్రకాష్‌నారాయణ, పార్టీ నాయకులు జూపూడి రంగరాజు, నీలం ప్రసాద్‌, లక్ష్మణ్‌, సాధు రామకృష్ణ, బ్రహ్మం, కుమార్‌గౌడ్‌, భాస్కర్‌, రమాకుమారి, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని