పట్టాభిపై విరుచుకుపడ్డ మేయర్‌
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

పట్టాభిపై విరుచుకుపడ్డ మేయర్‌

ఈనాడు, అమరావతి: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం వ్యాఖ్యలకు నిరసనగా నగర వైకాపా కార్పొరేటర్లు మంగళవారం రాత్రి గుంటూరు హిందూ కళాశాల సెంటర్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు పట్టాభిని తీవ్ర అసభ్యపదజాలంతో దూషించారు. ‘రెండున్నరేళ్లుగా ఓపిక పడుతున్నాం. మా నాయకుడు ఆదేశానుసారం ఏం మాట్లాడలేదు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేసుకుపోతున్న తమ నాయకుడిని దూషిస్తావా అంటూ’ విరుచుకుపడ్డారు. మరోసారి సీఎంపై వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోం అంటూ హెచ్చరించారు. సుమారు అరగంట సేపు ట్రాఫిక్‌ స్తంభింపజేశారు. నగర ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని