ఉత్తమ బోధనతో మంచి ఫలితాలు
eenadu telugu news
Published : 23/10/2021 06:02 IST

ఉత్తమ బోధనతో మంచి ఫలితాలు

ఐ.శ్రీవిద్య

తాడికొండ, న్యూస్‌టుడే: తమ విద్యార్థులు పీజీసెట్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారని లాం చలపతి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ నాదెండ్ల రామారావు తెలిపారు. గురువారం విడుదలైన పీజీ సెట్‌ ఫలితాల్లో తమ విద్యార్థిని ఐ.శ్రీవిద్య రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు చెప్పారు. శుక్రవారం కళాశాలలో చైర్మన్‌ వైవీ ఆంజనేయులు, ప్రిన్సిపల్‌ రామారావు ఉత్తమమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, అందుకు కృషి చేసిన అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో చలపతి విద్యార్థులకు ఆరు ర్యాంకులు వచ్చాయన్నారు. ఇదంతా ఉత్తమ బోధన పద్ధతులతోనే సాధ్యమైందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని