31 వరకు దూరవిద్యలో ప్రవేశాలు
eenadu telugu news
Published : 23/10/2021 06:17 IST

31 వరకు దూరవిద్యలో ప్రవేశాలు

మాచవరం, న్యూస్‌టుడే: మాచవరంలోని ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీ వరకు గడువును పొడిగించామని కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎం.అజంతకుమార్‌ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రూ.200 అపరాధ రుసుంతో ఈ నెలాఖరు వరకు గడుపు పొడిగించామని పేర్కొన్నారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ, పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ట్యూషన్‌ ఫీజును రూ.200 అపరాధ రుసుంతో ఈ నెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలన్నారు.  మరిన్ని వివరాలకు  0866-2434868, 73829 29642 నంబర్లలో సంప్రదించాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని