పెరిగిన ఆర్టీసీ ఆదాయం
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

పెరిగిన ఆర్టీసీ ఆదాయం

ఈనాడు - అమరావతి

ర్టీసీకి ఈ దసరా ఆదాయం కొత్త శక్తిని ఇచ్చింది. కొవిడ్‌ తర్వాత రెండో ఏడాది వచ్చిన రాబడి ఫర్వాలేదనిపించింది. గత ఏడాది నామమాత్రంగానే వచ్చింది. దీనితో పోలిస్తే పుంజుకున్నట్లు కనిపించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కంటే సొంత వాహనాల్లో వెళ్లే వారి సంఖ్య అధికం కావడం కూడా కారణమే. ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.1.45 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఈ ఏడాది విజయవాడకు దుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య క్రితం ఏడాది కంటే పెరిగింది. దీనికి తోడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కూడా కారణమైంది. పాఠశాలలు, కళాశాలలు చాలా వరకు రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. దీని వల్ల సొంతూళ్లకు పయనమయ్యే వారి సంఖ్య కూడా పెరిగింది. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ఏడాది ఎక్కువ బస్సులు తిరిగాయి. పండగ ముందు కంటే తర్వాతే ఎక్కువ బస్సులు నడిపారు. ముందు 292 నడవగా, తర్వాత 376 తిరిగాయి. 16, 17 తేదీల్లో విజయవాడలోని పీఎన్‌బీఎస్‌ ప్రయాణికులతో ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసింది.

* 2019లో ఎన్నడూ లేని విధంగా 9.66 లక్షల కి.మీ మేర 1,729 సర్వీసులను తిప్పారు. వీటి ద్వారా రూ.4కోట్ల వరకు ఆదాయం వచ్చింది. కిలోమీటరుకు సగటున రూ.41.43 సమకూరింది. ప్రయాణికుల నుంచి భారీగా ఆదరణ ఉండడంతో ఓఆర్‌ కూడా పెరిగింది. 93 శాతం ఓఆర్‌ నమోదైంది. ఇందులో సగం ఆదాయం కేవలం హైదరాబాద్‌ సర్వీసుల నుంచే వచ్చింది. ఈ మార్గంలో 873 బస్సులను 5.4లక్షల కి.మీ తిప్పారు. దీని ద్వారా రూ.2.22 కోట్ల ఆదాయం లభించింది. 2020లో కొవిడ్‌తో పరిస్థితులు తారుమారు అయ్యాయి. బస్సులను బాగా కుదించి 450 వరకు నడపాలని భావించారు. ఆయా మార్గాల్లో సాధారణ బస్సులే సరిగా నిండకపోవడంతో వీటిని నడిపే అవసరం రాలేదు. పండగ అనంతరం తిరుగు ప్రయాణం చేసే వారి సంఖ్య పెరగడంతో కేవలం 40 సర్వీసులను మాత్రమే నడిపారు. ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని