ఇంధన ధరలపై ప్రజా బ్యాలెట్‌
eenadu telugu news
Published : 26/10/2021 04:32 IST

ఇంధన ధరలపై ప్రజా బ్యాలెట్‌

లెనిన్‌కూడలిలో మహిళల నుంచి సంతకాలు సేకరిస్తున్న సమాఖ్య ప్రతినిధులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌, నూనె, వంట గ్యాస్‌, విద్యుత్తు ఛార్జీలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయని భారత జాతీయ మహిళా సమాఖ్య, ఏపీ మహిళా సమాఖ్య విజయవాడ నగర శాఖలు విమర్శించాయి. ధరల నియంత్రణలో ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ సోమవారం ఉదయం లెనిన్‌కూడలిలో ప్రజాబ్యాలెట్‌ కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవానీ మాట్లాడుతూ.. పెట్రోల్‌ ధర రోజువారీ పెరుగుదలతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబంపై రెట్టింపు భారం పడుతోందని వాపోయారు. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షాపింగ్‌కు వచ్చిన వారి నుంచి ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర కోశాధికారి పంచదార్ల దుర్గాంబ, విజయవాడ నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, ప్రజానాట్యమండలి, ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని