మల్లిరెడ్డిది ఆత్మహత్యగా అనుమానం?
logo
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మల్లిరెడ్డిది ఆత్మహత్యగా అనుమానం?


మృతునికి సంబంధించిన సెల్‌ఫోన్‌, పర్సు, ఆధార్‌ కార్డు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని తితిదే ఆస్థాన మండపం సెల్లార్‌లోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మంగళవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మల్లిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కేసును నమోదు చేసిన తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అగ్నిప్రమాదంలో మృతిచెందినట్లు భావిస్తున్న తుమ్మల మల్లిరెడ్డికి చెందిన ఓ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దానిని ఓపెన్‌చేసి చూడగా అందులో మృతుడు తన ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోను గుర్తించారు. అందులో అతను ఆత్మహత్యకు పాల్పడనున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు సదరు వ్యక్తి పనిచేస్తున్న దుకాణానికి సంబంధించిన వ్యక్తులతో పాటు, అతనికి దగ్గరగా ఉన్న వ్యక్తులను విచారిస్తున్నారు. ఇప్పటి వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రమాదం విద్యుదాఘాతంతో జరిగిందని భావిస్తుండగా.. ప్రస్తుతం మృతుని సెల్ఫీ వీడియోతో ఇది ఆత్మహత్య సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంగా భావిస్తున్నారు. అదేసమయంలో మృతుడు పెట్రోల్‌ పోసుకుని మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని