వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి
eenadu telugu news
Published : 19/10/2021 05:48 IST

వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి


చిరుత కళేబరం

 

తవణంపల్లె, న్యూస్‌టుడే: మండల పరిధిలోని కొడ్రాజు కాలువ పంచాయతీ మడవనేరి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో అడవి పందుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కుకుని మరణించింది. డీఆర్‌వో శివరాం కథనం మేరకు.. మడవనేరి గ్రామానికి చెందిన మునస్వామి కుమార్తె చినపాపమ్మ పొలంలో ఈ ఘటన జరిగింది. ద్విచక్ర వాహన క్లచ్‌ తీగతో వేపచెట్టుకు వేటగాళ్లు బిగించిన ఉచ్చుకు చిరుత బలైంది. అది మగ చిరుత అని, వయసు 2 నుంచి 3 ఏళ్లలోపు ఉండవచ్చన్నారు. దాని గోళ్లు, చర్మం అలానే ఉన్నాయి. కళేబరానికి పశువైద్యులతో పంచనామా నిర్వహించి దహనం చేశారు. నిందితులను పట్టుకొని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఆర్‌వో వివరించారు. చిత్తూరు పశ్చిమ డీఎఫ్‌వో రవిశంకర్‌, ఎఫ్‌ఆర్‌వో సుభాష్‌, ఎఫ్‌డీవో శంకరప్ప, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని