ఎలక్ట్రికల్‌ వ్యాపారాలపై తనిఖీ
eenadu telugu news
Published : 22/10/2021 05:17 IST

ఎలక్ట్రికల్‌ వ్యాపారాలపై తనిఖీ


మదనపల్లెలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: ప్రత్యేక పన్ను సంరక్షణలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో 21 ఎలక్ట్రికల్‌ వస్తువుల విక్రయ దుకాణాలపై తనిఖీలు చేపట్టారు. గతంలో సిగరెట్‌ వ్యాపారులు, బ్యూటీపార్లర్లలో తనిఖీ చేసిన అధికారులు, ఇప్పుడు పెద్దఎత్తున ఎలక్ట్రికల్‌ వ్యాపారాలపై నిఘా పెట్టారు. బిల్లులు సక్రమంగా లేనివారికి రూ.50 లక్షలు జరిమానా విధించారు. బిల్లులు ఇవ్వని వ్యాపారుల సమాచారాన్ని 9988997444 నంబరుకు వాట్సాప్‌ ద్వారా తెలియజేయాలని ఇప్పటికే అధికారులు అవగాహన కల్పించారు. ఇందుకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని అధికారులు చెప్పారు. తమకు అందిన సమాచారం ఆధారంగా ఆయా వ్యాపార రంగాలపై తనిఖీలు చేపడుతున్నామని, ఇకపై విస్తృత తనిఖీలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని